పాఠశాల శత వసంతాలను ఘనంగా నిర్వహిద్దాం
ఉత్సవ కమిటి అధ్యక్షులు బాదిమి రవిశంకర్
విద్యార్థులకు అవసరమైన వసతులకు కృషి
జడ్చర్ల రూరల్, జులై 26 (మనఊరు ప్రతినిధి): చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువైన ఈ పాఠశాల శత వసంతాల ఉత్సవాల సందర్భంగా శుక్రవారం పట్టణంలోని జడ్పిహెచ్ఎస్ బాలుర బాదేపల్లి పాఠశాల శతాబ్ది ఉత్సవాలను సమిష్టిగా విజయవంతం చేద్దామని ఉత్సవ కమిటి అధ్యక్షులు బాదిమి రవిశంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వి. కృష్ణలు పిలుపునిచ్చారు. శనివారం హైస్కూల్లో ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. నవంబర్ నెల చివరి వారంలో నిర్వహిస్తున్న మూడు రోజుల ఉత్సవాలను జయప్రదం చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ ఉత్సవాల్లో పూర్తి భాగస్వామ్యం కావాలని కోరారు. ఉత్సవాలకు సంబంధించి కార్యక్రమాల నిర్వహణ, హైస్కూల్లో అత్యవసరంగా కావాల్సిన వసతుల గూర్చి తెలియజేయాలని ఉపాధ్యాయులను కోరారు. స్పందించిన ఉపాధ్యాయులు హైస్కూల్లకు అత్యవసరంగా బాయిలెట్స్, విద్యార్థులకు డైనింగ్ హాల్ నిర్మించాలని ఉపాధ్యాయులు వివరించారు. ఉత్సవాల నిర్వహణలో పూర్తి సహాకారం అందిస్తామని వారు హమీ ఇచ్చారు. శతాబ్ది ఉత్సవాలలో భాగస్వామ్యం కావటం మనందరి అదృష్టమన్నారు. ఉత్సవాలు చిరస్థాయిగా నిలిచిపోయి భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా చేద్దామన్నారు. టాయిలెట్స్, డ్రైవింగ్హాల్ నిర్మాణాలకోసం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మంజూరి చేయించుకుందామని నిర్ణయించారు. ప్రదానోపాధ్యాయురాలు చంద్రకళ మాట్లాడుతూ స్టాఫ్ సెక్రటరి గోపాల్, యుగంధర్రెడ్డి, శంకర్, శశిరేఖ, భాగ్యతోపాటు ఉపాధ్యాయబృందం, శతాబ్ది ఉత్సకమిటి ఉపాధ్యక్షులు సయ్యద్బ్రహీం, జీనురాల సత్యం, ఆర్గనైజింగ్ కార్యదర్శి కంచుకోట ఆనంద్ లు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఉత్సవ కమిటి అధ్యక్షుడు రవిశంకర్ ను ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించారు.