పొగాకు వాడకాన్ని నిషేధించాలి
పాఠశాల హెచ్ఎం ఎస్.శిల్ప
పొగాకు రహిత సమాజం కొరకు పాఠశాల విద్యార్థుల ర్యాలీ
జడ్చర్ల రూరల్, జులై 26 (మనఊరు ప్రతినిధి): పొగాకు వాడకాన్ని నిషేధించాలని హెచ్ఎం ఎస్.శిల్ప అన్నారు. శనివారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో గల సంస్కార్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి ప్లకార్ట్స్ చేత పట్టుకొని చేయొద్దు చేయొద్దు కుటుంబాన్ని ఆగం చేయొద్దు, నిషేధిద్దాం నిషేధిద్దాం పొగాకు వాడకాన్ని నిషేధిద్దాం, స్మోకింగ్ త్రీల్స్ బట్ ఇటు కిల్స్ , మానాలి మానాలి పొగాకు వాడకం మానాలి మానాలి మానాలి పొగాకు అమ్మకం మానాలి* అనే నినాదాలు చేస్తూ కొత్త బస్టాండ్ సమీపంలోని ఫ్లైఓవర్ క్రింద మనోహరంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొగాకు, వాటి ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. పొగాకు వాడకం వల్ల నష్టాలు అధికంగా ఉంటాయని, అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నారు. భవిష్యత్తులో పొగాకు అనే మహమ్మారి జోలికి పోకుండా విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ అదేవిధంగా గ్రామంలోని యువత, పెద్దవారు పొగాకు వాడకూడదని పొగాకు వాడకం వలన క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తాయని సందేశాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య సభ్యులు జి.రాధిక, సందీప్, గడ్డం, ఎ.తేజ శ్రీ, కె.కళ్యాణ్ ,ఉపాధ్యాయులు కిరణ్మయి, సంధ్య,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.