ఇద్దరికీ కుట్టుకోతలేని వ్యాసెక్టమీ ఆపరేషన్ లు విజయవంతం.
మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ ఆర్. రఘు
నాగర్ కర్నూల్, జూలై 2 (తెలుగు మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో బుధవారం నాడు పురుషులకు నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఎలాంటి కుట్టు కోత లేకుండా సుశిక్షితులైన ప్రత్యేక వైద్య నిపుణలచే నో స్కాల్పల్ వ్యాసెక్టమీ కుటుంబ నియంత్రణ జిల్లా కు చెందిన ఇద్దరికి బుధ వారం నాడు ఆపరేషన్ నిర్వహించినట్లు ప్రభుత్వ సాధరణ ఆస్పత్రి మెడికల్ సూపర్డెంట్ ఆర్. రఘు తెలిపారు. ప్రత్యేక వైద్య నిపుణులు రేసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సి. హనుమంతరావు మాట్లాడుతూ వ్యాసెక్టమీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ పురుషులు చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని, తన సంసార జీవితంలో యధావిధిగా కొనసాగించవచ్చని, సంసార దాంపత్యంలో ఇలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. కరీంనగర్, సిద్దిపేట్, నిజామాబాద్ ప్రాంతాలలో ఎక్కువగా పురుషులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటారని అన్నారు. కుటుంబంలో భార్యకు సిజేరియన్ ఆపరేషన్ లు జరిగిన భర్త , భార్యకు ఫిట్స్ ,మూర్ఛ వ్యాధి , క్యాన్సర్ రోగం, ఇతర ఇబ్బందులు గల వారి భర్త తప్పనిసరిగా వ్యాసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు.ఈ ప్రాంతంలో కూడా అవసరమైన వారు ఆపరేషన్ చేసుకొనుటకు ముందుకు రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ ప్రశాంత్,నర్సింగ్ ఆఫీసర్లు కె.ఆనంద్,పి. శోభారాణి, ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ ఇన్చార్జి ఆరోగ్య కార్యకర్త టీ.యాదగిరి, ఫార్మసిస్ట్ కే .గోవర్ధన్, ఆశా కార్యకర్త జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.