మాజీ ఎంపీపీ జంగయ్యకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దక్కేనా ?

 మాజీ ఎంపీపీ అన్నెపాక జంగయ్యకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దక్కేనా ?

మాడుగుల, జూన్ 12 (మనఊరు ప్రతినిధి): మాడుగుల మండలంలో అన్నెపాక జంగయ్య 1995 నుంచి 2000 వరకు ఎంపీపీగా పనిచేసి 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పని చేస్తున్నారు. నీతి నిజాయితీతో నిబద్ధత గల వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు. మండల వ్యవస్థ ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు మాడుగుల మండలంలో దళితులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దక్కలేదు. దీనితో దళితుల్లో అసంతృప్తి ఏర్పడింది. ఈ సారైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని మాజీ ఎంపీ అన్నెపాక జంగయ్యకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే ఈ వర్గాల్లో సంతృప్తి చెందుతుంది అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో దళిత సామాజిక వర్గానికి ఓట్లు ఎక్కువగా ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి లబ్బి చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

Previous Post Next Post