మెకానికల్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి

 మెకానికల్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి

కంపెనీ యాజమాన్యం కారణంగానే తన భర్త మృతి చెందినట్లు పోలీసులకు మృతుడి భార్య ఫిర్యాదు

మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు

నవాబుపేట, జూలై 4 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని కాకర్జాల గ్రామ సమీపంలో గల మనోహర్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మెకానికల్ ఇంజనీర్ పూర్ణచందర్ రావు (43) తనకు కంపెనీ వారు కేటాయించిన గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పమిడి ముక్కల మండల పరిధిలోని మంటాడ గ్రామానికి చెందిన కాశి పూర్ణచందర్ రావు ఈ సంవత్సరం ఏప్రిల్ నెల రెండవ తేది కంపెనీ యజమాని పవన్ గార్గ్ ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్ పొంది కంపెనీలో మెకానికల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. గురువారం యధావిధిగా కంపెనీలో విధులు నిర్వహించిన పూర్ణచందర్ రావు శుక్రవారం తెల్లవారేసరికి తనకు కంపెనీవారు కేటాయించిన గదిలో శవమై కనిపించాడు. అతడిని గదిలో విగత జీవిగా చూసిన తోటి ఉద్యోగి మనోజ్ మృతుడి భార్య దీప్తికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మనోజ్ ద్వారా సమాచారం అందుకున్న ఆయన భార్య దీప్తి, బంధువులు అక్కడికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఆయన మృతి అనుమానాస్పదంగా కనిపించడంతో తన భర్త మృతికి కంపెనీ యాజమాన్యమే కారణమని మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త మృతి విషయంలో కంపెనీ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మృతుడి భార్య దీప్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఎం.విక్రమ్ తెలిపారు.

Previous Post Next Post