*ఎంపీ డీకే అరుణ ఫ్లెక్సీల చించివేత*
*తిమ్మాపూర్ చౌరస్తాపై పెట్టిన ఫ్లెక్సీలను తొలగించిన గుర్తు తెలియని వ్యక్తులు*
*ఆందోళన వ్యక్తం చేస్తున్న బిజెపి కార్యకర్తలు*
కొత్తూరు, జులై 26 (మనఊరు ప్రతినిధి): పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు బిజెపి నాయకురాలు డీకే అరుణ ఫ్లెక్సీలను రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు. దీంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం కొత్తూరు మండలం తిమ్మాపూర్ నియోజకవర్గ ముఖ కేంద్రం వద్ద రాత్రి బిజెపి కార్యకర్తలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాక సందర్భంగా ఫ్లెక్సీలు కట్టారు. ఈ ఫ్లెక్సీలలో కొన్నింటిని చింపి చిందరవందరగా పడేయడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేక ఇలాంటి దొంగచాటు పనులు ప్రచారం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.