విద్యార్థులు సాగు పాఠాలు నేర్చుకుంటూ..
క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థినులు
పంటలపై రైతులకు సలహాలు, సూచనలు, అవగాహన
మెదక్, జులై 25 (మనఊరు ప్రతినిధి): క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ సమాచారాన్ని అందించడంలో బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ విద్యార్థినులు శిక్షణ తరగతుల్లో భాగంగా శుక్రవారం రావేప్ ప్రోగ్రామ్ లో భాగంగా కృషి విజ్జెన కేంద్రంలో మెదక్ జిల్లా, కౌడిపల్లి మండలం, తునికి (గ్రామం, రైతు పొలంలో వరి నాటే కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. నేటి బాలలే రేపటి పౌరులు,.. నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు మొన్నటి వరకు తరగతి గదిలో నేర్చుకున్న పాఠా లను ఆచరణలో పెట్టేం దుకు మల్లరెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్, ఫైనల్ ఇయర్ విద్యార్థినులు మొదట వరి పొలంలో నాట్లు వేసే విధానం, వరిసాగులో ఉపయోగించే పద్ధతులు, ఎరువుల వినియోగం వంటి వాటి గురించి విద్యార్థులు ఆసక్తిగా రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటల గురించి పుస్తకంలో చదవడం కన్నా క్షేత్రస్థాయికి వచ్చి తెలుసుకోవడం చాలా బాగుందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ప్రతి విద్యార్థి క్షేత్రస్థాయిలో పంటల సాగు గురించి తెలుసుకోవడం ద్వారా మంచి అవగాహన వస్తుందని, అలాగే రైతుల శ్రమ ఏమిటో అర్థం అవుతుందని వారు పేర్కొన్నారు. ఆహారం పండించడానికి పడే కష్టం తెలిసిన వారు ఖచ్చితంగా ఆహారం వృధా చేయరని, నేటి యువతకు పంటల సాగు గురించి అవగాహన ఆవశ్యకమని, రైతు పొలంలో వరి నాట్లు వేస్తున్న విద్యార్థినీలు భవిష్యత్తులో ఈ విద్యార్థినీలు మంచి (శాస్త్రవేత్తలు గా మారి దేశానికి రైతులకు , వాళ్ళు ఉన్న ఊరికి తల్ల తంద్రులకు పేరు ప్రతిష్టలు తేవాలని ఆశిద్దాం. ఈ రకమైన (కెఎన్ఎం) వరి విత్తనాలు వాడి ఎక్కువ కెఎన్ఎం 1638 దిగుబడి కోసం వ్యవసాయంచేస్తు, ఈ విధంగా రైతులలో మమేకమై వరి నాట్లు వేస్తున్నారు.