నేడు పెంపుడు కుక్కలకు ఉచిత వ్యాక్సిన్‌

 నేడు పెంపుడు కుక్కలకు ఉచిత వ్యాక్సిన్‌

నాగర్ కర్నూల్, జులై 5 (మనఊరు ప్రతినిధి): ప్రపంచ జునోసిస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆసుపత్రిలో పెంపుడు కుక్కలకు ఉచితంగా ర్యాబిస్‌ వ్యాధి నివారణా టీకాలు ఇస్తామని జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి బి. జ్ఞానశేఖర్ తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని పశువుల ఆసుపత్రుల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకూ టీకాలు వేస్తామన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పెంపుడు కుక్కలను పెంచుకునేవారందరూ శిబిరంలో తమ పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలన్నారు. 

Previous Post Next Post