వ్యాధులపై తగు జాగ్రత్తలు తీసుకోవాలి

 క్షేత్రస్థాయిలో కాలానుగుణంగా వచ్చే వ్యాధులపై అవగాహన

తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆకస్మికంగా ఆసుపత్రినీ తనిఖీ చేసిన జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎం.వెంకట్ దాస్ 

 



బిజినపల్లి, జూలై 23 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రంలోనీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం నాడు జిల్లా ఉప వైద్యా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం.వెంకట దాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న ఔట్ పేషెంట్ విభాగంలో అందిస్తున్న ఆరోగ్య సేవలను పరిశీలించారు. మందుల నిల్వలను రికార్డులను పరిశీలించారు.వర్షాల కారణంగా వ్యాధులు తీవ్రత, ప్రబలుతున్నటువంటి రోగాలపై జాగ్రత్త వహించాలని, తగిన చర్యలు క్షేత్రస్థాయిలో తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.ఇంటింటా క్షేత్రస్థాయి సిబ్బంది పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని, దోమలు పెరుగుతున్నటువంటి ఆవాస కేంద్రాలను తొలగించాలని, ఇతర శాఖల సహాయ సహకారాలతో కార్యాచరణాలను రూపొందించుకొని అమలు పరచాలని అన్నారు.ముఖ్యంగా గర్భవతులలో ప్రమాదకర సాంకేతాలు కలిగినటువంటి గర్భిణీ స్త్రీలను గుర్తించి, వారిని తగు ఆరోగ్య చర్యలు తీసుకొని అన్ని ప్రసవాలు ప్రభుతు ఆసుపత్రిలలో జరిగేటట్లుగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈకార్యక్రమంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ ఎం. శివకుమార్,ఆరోగ్య విస్తరణ అధికారి పి.రమేష్ కుమార్, హెల్త్ సూపర్వైజర్ కే.గంగ, అశోక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post