అస్వస్థతకు గురైన గురుకుల విద్యార్థినులకు అస్వస్థత..
స్పందించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్..!
జగిత్యాల, జులై 22 (మనఊరు ప్రతినిధి): గురుకులంలో మధ్యాహ్న భోజనం వికటించి ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఐదుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి పిల్లల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థినుల ఆరోగ్యంపై డాక్టర్లతో మాట్లాడిన అనంతరం, చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ వారికి ఎలాంటి అపాయం లేదని, ఆరోగ్యంగా ఉన్నారని కలెక్టర్ తెలిపారు. పిల్లలు పూర్తిగా కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా డీఎంహెచీ డాక్టర్ ప్రమోద్ కుమార్, సూపరిండెంట్ డాక్టర్ కృష్ణమూర్తి, ఆర్ఎంఓ డాక్టర్ సుమన్ రావు తదితరులు ఉన్నారు.