పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి
బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ యాదవ్
జడ్చర్ల రూరల్, జులై 22 (మనఊరు ప్రతినిధి): పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మార్సీ భవనం ఆవరణలో బీసీ జాగృతి సేన ముఖ్యనాయకుల సమావేశంలో బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి ముందడుగేసిన రాష్ట్రప్రభుత్వానికి రాజకీయాలకతీతంగా తెలుగు రాష్ట్రాల్లోని లోక్ సభ, రాజ్యసభ సభ్యులందరు మద్దతుగా పార్లమెంట్ లో తమ గొంతు కను వినిపించాలని, పార్లమెంటు సభ్యులు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ తమ ఇండియా కూటమి లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో కలిసి ప్రస్తుతం నడుస్తున్న వర్షాకాలం పార్లమెంటు సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం 50శాతం సీలింగ్ విధానాన్ని రద్దు చేసిపార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఒత్తిడి తేవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఓట్ల కోసం ఒకపక్క బీజేపీ జాతీయ నాయకులు బీసీ జపం చేస్తుంటే బిజెపి పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులు రామచంద్ర రావు 42 శాతం రిజర్వేషన్ బిల్లు చెల్లదని తెలంగాణ రాష్ట్రాన్ని షెడ్యూల్ 9లో చేర్చడానికి చిక్కులు ఉన్నాయని అంటున్నారని, ఆ చిక్కులను పార్లమెంటు సాక్షిగా తొలగించే నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై లేదాఅని ప్రశ్నించారు.
అగ్రకుల దుర హంకారంతో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడితే రాష్ట్రంలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ జాగృతి సేన మండల అధ్యక్షులు గొడుగు నర్సిములు, కార్మిక విభాగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సురభి విజయ్ కుమార్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి లింగం పేట్ శేఖర్, రైతు సంఘము జిల్లా అధ్యక్షులు గోపాల్, జిల్లా నాయకులు మాచారం శ్రీనివాస్, కట్ట మురళి, మండల కార్యదర్శులు సురభి రఘు, చెన్నయ్యముదిరాజ్, పట్టణ. అధ్యక్షులు శివరాములు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.