సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మునిసిపల్ కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి
జడ్చర్ల రూరల్, ఆగస్టు 6 (మనఊరు ప్రతినిధి): సీజనల్ వ్యాదులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మునిసిపల్ కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం మునిసిపల్ పరిధిలోని 24వ వార్డులో సీజనల్ వ్యాధులు రాకుండా వార్డులలో పిచ్చి మొక్కలను తొలగించారు. అలాగే వార్డులో గల పార్కులను అభివృద్ధి చేయడం కోసం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పాత టైర్లు, టబ్బులు, కొబ్బరి బొండాలు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందుతాయని, వాటివల్ల మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు సోకుతాయన్నారు. వార్డులలో దోమల లార్వాలు నశించడం కోసం స్ప్రే చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ జి. లక్ష్మారెడ్డి, కాలనీ వాసులు వెంకటేశ్వర్ రెడ్డి, అంబరీశ్వర్, నోముల కృష్ణయ్య, పూర్ణచందర్ రావు, ఆశ వర్కర్లు, ఎలక్ట్రిసిటీ సిబ్బంది, కాలనీవాసులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.