తండ్రి వేధింపులు భరించలేక హత్య

 తండ్రిని చంపిన తనయుడు

 తండ్రి వేధింపులు భరించలేక హత్య

నవాబుపేప, ఆగస్టు 8 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని కామారం గ్రామానికి చెందిన చిలుక కృష్ణయ్య (50) అనే వ్యక్తిని ఆయన కుమారుడు వెంకటేశ్ శుక్రవారం తెల్లవారుజామున రోకలి బండతో విచక్షణారహితంగా కొట్టి చంపాడు. 2015వ సంవత్సరంలో తన భార్యను హత్య చేసి జైలుకు వెళ్లి ఏడాదిన్నర క్రితం తిరిగి జైలు నుండి ఇంటికి వచ్చిన మృతుడు తన కుమారుడైన వెంకటేష్ పేరుపై ఉన్న 30 గుంటల భూమిని తన పేరుపై చేయించాలని తరచూ గొడవ పడుతుండేవాడు. శుక్రవారం తెల్లవారుజామున కూడా మృతుడు నిందితుడితో గొడవపడి చేయి చేసుకోగా అది భరించలేని నిందితుడు అందుబాటులో ఉన్న రోకలి బండను తీసుకొని ఆయనను దానితో విచక్షణారహితంగా కొట్టి చంపి తన పెద్ద నాన్నలైన చిలుక చెన్నయ్య, సత్యనారాయణలకు తాను చేసిన ఘాతకం గురించి తెలిపి అక్కడి నుండి పరారయ్యారు. మృతుడి సోదరుడు చెన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ఎం.విక్రమ్ తెలిపారు.

Previous Post Next Post