పోలేపల్లి -కారూర్ రోడ్డును మంజూరు చేయండి ఎమ్మెల్యే గారు

 పోలేపల్లి -కారూర్ రోడ్డును మంజూరు చేయండి ఎమ్మెల్యే గారు

 పోలేపల్లి గ్రామస్తుల విజ్ఞప్తి 

జడ్చర్ల రూరల్, ఆగస్టు 8 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల మండల పరిధిలో ని పోలేపల్లి -కారూర్ రోడ్డును ఎమ్మెల్యే జనాంపల్లి అనిరుద్ రెడ్డి మంజూరు చేసి ప్రజల కష్టాలు తీర్చాలని పోలేపల్లి- కారుర్ గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో

బ్రిడ్జి కట్టి మధ్యలో ఆపారని గుర్తు చేశారు. జడ్చెర్ల మండలం పోలేపల్లి ద్వారా జడ్చెర్ల నియోజక వర్గం నుండి నవాబ్ పేట మండల కేంద్రానికి అనుసంధానంగా వున్న రోడ్డు ను అభివృద్ధి చేయడంలో భాగంగా గత బీ ఆర్ ఎస్ సర్కార్ 2022వ సంవత్సరంలో ఓ గుతేదారుకు రు. 33 లక్షలు మంజూరి చేయగా 

అతను కాంక్రీట్ తో సిమెంట్ పిల్లర్లను నిర్మించి అసంపూర్తిగా వదిలి వేయడము వల్ల ప్రజా ధనము వృధా కావడమే కాకుండా ప్రజలు పోలేపల్లి నుండి తమ పొలం పనులకీ వెళ్లే రైతులు, రోజు వారి పనులకు వెళ్లే కూలీలు ఇతర, కార్మిక వర్గాలు, రోజు నరక యాతన అనుభవించాల్సి వస్తుందన్నారు. అంతే కాకుండా వర్షము ఎక్కువపడినప్పుడు, పూర్తిగా రాక పోకలు బంద్ అవుతున్నాయని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జడ్చెర్ల శాశనసభ్యులు అనిరుద్ రెడ్డి స్పందించి త్వరగా అధికారులు రెండు గ్రామాల మధ్య (పోలేపల్లి -కారూర్) రోడ్డును శాంక్షన్ చేయించగలరని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.






Previous Post Next Post