ఇంటిలోకి మోకాళ్ళ లోతు నీరు..

 *షాద్‌నగర్‌లో కుండపోత వర్షం...*

*ఇంటిలోకి మోకాళ్ళ లోతు నీరు..*

*చేతులతో నీటిని తోసివేస్తూ రాత్రంతా కుటుంబం జాగరణ*

*తక్షణమే ఘటన స్థలానికి మాజీ కౌన్సిలర్లు యుగంధర్, పావని నర్సింలు చేరుకొని సురక్షిత ప్రాంతాలకు తరలింపు*


షాద్‌నగర్, జులై 18 (మనఊరు ప్రతినిధి): గత రాత్రి షాద్‌నగర్ పట్టణాన్ని ధరాధారంగా కురిసిన వర్షం అతలాకుతలం చేసింది. మంగళవారం రాత్రి ఏడు తెరపుల వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా భాగ్యనగర్ కాలనీలో భూషణ్ నరేష్ గారి ఇంటిలోకి భారీగా వర్షపు నీరు చేరింది.

వెంటాడిన వర్షపు నీరు వంటగది, దేవుని గది, బెడ్‌రూమ్‌ల వరకు మోకాళ్ళెత్తు నీటితో నిండిపోయింది. దాంతో కుటుంబ సభ్యులు రాత్రంతా నిద్ర లేకుండా చేతితో నీటిని బయటికి తోసుకుంటూ గడిపారు. ఇంటి చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ వలన నీరు బయటకు వెళ్లలేకపోయింది. గేట్‌కి ప్లాస్టిక్ షీట్‌లతో కవర్‌తో ఇంటి పరిసరాలు చెరువు లాగా మారిపోయాయి. నీటి ఒత్తిడి తట్టుకోలేక చివరికి గేట్ మరియు వెనకవైపు కాంపౌండ్ వాల్ కూలిపోయి నీరు బయటకు వెళ్ళింది. ఇప్పటికే ఇంటిలోకి చాలా వరకు నీరు చేరింది. విషయం తెలుసుకున్న మాజీ కౌన్సిలర్లు యుగంధర్ గారు మరియు పావని నర్సింలు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. భూషణ్ నరేష్ కుటుంబాన్ని తాత్కాలికంగా మరొక సురక్షిత ఇంటికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఇలాంటి పరిస్థుతుల్లో మునిసిపాలిటీ తక్షణ చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Previous Post Next Post