పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయండి

 సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయండి

జై గౌడ్ ఉద్యమం జిల్లా అధ్యక్షులు తమటం వెంకటస్వామి గౌడ్

ఉత్సవాల పోస్టర్ విడుదల

నాగర్ కర్నూల్, ఆగస్టు 6 (మనఊరు ప్రతినిధి): రాష్ట్ర రాజధానిలోని, రవీంద్రభారతిలో ఈనెల 10న నిర్వహిస్తున్న సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని జై గౌడ్ ఉద్యమం జిల్లా అధ్యక్షులు తమటం వెంకటస్వామి గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సోమప్రగతిగౌడ్ గార్ల ఆధ్వర్యంలో ఆయన పోస్టర్ విడుదల చేశారు. అలాగే ఆహ్వాన పత్రికలను అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలలో జిల్లాలోని గౌడ కులస్తులందరూ పాల్గొని వేడుకను ఘనంగా నిర్వహించలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జై గౌడ ఉద్యమం రాష్ట్ర అధ్యక్షులు గుండ్రాతి నారాయణగౌడ్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణగౌడ్, రమేష్ గౌడ్, నోముల సురేష్ గౌడ్, కాట గౌని హరీష్ గౌడ్, కొల్లాపూర్ తాలూకా అధ్యక్షులు సురగౌని వెంకటస్వామిగౌడ్, నిర్మలగౌడ్, తమటం రామన్ గౌడ్, రంజిత్ గౌడ్, తమటం యుగందర్ గౌడ్, కాటమొని శ్రీధర్ గౌడ్, లింగాల చక్రధర్ గౌడ్, గుండ్రాతి సత్యంగౌడ్, కట్ట రమేష్ గౌడ్, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, యూత్ ఉపాధ్యక్షులు హరీష్ గౌడ్, బాలింగంగౌడ్, పరమేశ్వర్ గౌడ్, యుగేందర్ గౌడ్, జై గౌడ్ ఉద్యమం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




Previous Post Next Post