ఎమ్మెల్యే సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు

 దుష్యంత్ రెడ్డి నుండి మాకు ప్రాణహాని ఉంది 

ఆయన బారి నుండి మమ్మల్ని రక్షించండి 

ఎమ్మెల్యే సోదరుడిపై పోలీసులకు ఫిర్యాదు

నవాబుపేట, ఆగస్టు 7 (మనఊరు ప్రతినిధి):  మండల పరిధిలోని చౌడూరు గ్రామానికి చెందిన ఓ భూ వివాదానికి సంబంధించి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సోదరుడు దుష్యంత్ రెడ్డితో పాటు మరికొందరిపై ఆ గ్రామానికి చెందిన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయంగా, ఆర్థికంగా పలుకుబడి ఉన్న దుష్యంత్ రెడ్డి నుండి వారికి ప్రాణహాని ఉంది. తాము గత 50 సంవత్సరాలుగా ఖాస్తులో ఉన్న భూమిని ఎమ్మెల్యే సోదరుడు దుష్యంత్ రెడ్డి మరికొందరితో కలిసి ఇతరుల పేరు కొనుగోలు చేసి ఆ విషయంలో తమను భయభ్రాంతులకు గురిచేయడంతోపాటు తమపై ఆయన నవాబుపేట పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా కేసులు పెట్టారని తెలిపారు. ఈ విషయంలో తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న దుష్యంత్ రెడ్డితో పాటు ఆయనకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు, అలాగే దుష్యంత్ రెడ్డి బారి నుండి తమను రక్షించాలని, తమపై అక్రమంగా కేసు నమోదు చేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని వారు డిఐజి, జిల్లా పోలీస్ సూపరిండెంట్ లకు వినతి పత్రాలు సమర్పించారు.



Previous Post Next Post