యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
నుకం వరప్రసాద్ జ్ఞాపకార్థం సందర్భంగా 45 యూనిట్స్
నాగర్ కర్నూల్, మార్చి 15 (మనఊరు న్యూస్): యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని నాగర్ కర్నూల్ జిల్లా యువశక్తి ఫౌండేషన్ అధ్యక్షులు మహేందర్ తెలిపారు. విలేరాలోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం లక్నవరం గ్రామంలో నూకo వరప్రసాద్ జ్ఞాపకార్ధం సందర్బంగా ఒక మంచి పుణ్య కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్యేశ్యంతో నూకం వరప్రసాద్ మిత్ర బృందం యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరం 45 యూనిట్లతో విజయవంతంగా ముగిసింది.అందుకు గ్రామ యువతని వరప్రసాద్ మిత్ర బృందాన్ని అభినందిస్తూ యువశక్తి ఫౌండేషన్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన యువతీ యువకులు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి రక్తహీనతతో బాధపడుతున్న ఎందరో అభాగ్యులకు ప్రాణదానం చేసి వారి ప్రాణాలను కాపాడాల్సిందిగా కోరడం జరిగింది.అనంతరం వారికి ప్రశంస పత్రం అందజేశారు.ఈ కార్యక్రమం లో నాగర్ కర్నూల్ జిల్లా యువశక్తి ఫౌండేషన్ అధ్యక్షులు మహేందర్, నాగేష్, గ్రామ యువకులు, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ల్యాబ్ టెక్నిసియన్స్ రాజు, షాకిర్, నర్సింగ్ ఆఫీసర్ హరికృష్ణ, రాము పాల్గొన్నారు.

