బీసీ బాలికల హాస్టల్‌లో 15 మందికి అస్వస్థత

 బీసీ బాలికల హాస్టల్‌లో 15 మందికి అస్వస్థత

జిల్లా ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్యేలు జీఎంఆర్, మేఘా రెడ్డి

వనపర్తి, కొత్తకోట, 30 (మనఊరు ప్రతినిధి): కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని బీసీ బాలికల వసతి గృహంలో నివసిస్తున్న 15 మంది విద్యార్థినులు స్వల్ప అస్వస్థతకు గురైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) హుటాహుటిన వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని, స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డితో కలిసి విద్యార్థినులను పరామర్శించారు. విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యేలు, అనంతరం డీఎంహెచ్ఓతో చర్చించి చికిత్స వివరాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ బీసీ బాలికల వసతి గృహంలో మొత్తం 140 మంది విద్యార్థినులు వివిధ కళాశాలల్లో చదువుకుంటున్నారని, సాయంత్రం హాస్టల్‌కు తిరిగి వచ్చే సమయంలో కొందరు జంక్ ఫుడ్ తీసుకోవడం వల్లే అస్వస్థతకు గురై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డీఎంహెచ్ఓకు ఎమ్మెల్యేలు జీఎంఆర్, మేఘా రెడ్డి ఆదేశించారు. అనంతరం హాస్టల్ వార్డెన్‌తో మాట్లాడి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు.











Previous Post Next Post