విద్యార్థుల భవిష్యత్ కు పదవ తరగతి పునాది వంటిది

విద్యార్థుల భవిష్యత్ కు పదవ తరగతి పునాది వంటిది
కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ బాబు అశ్వారావుపేట, మార్చి 20 (మనఊరు న్యూస్): విద్యార్థుల భవిష్యత్ కు పదవ తరగతి పునాది వంటిదని, పరీక్షలు బాగా రాయాలని ఒత్తిడి లేకుండా పరీక్ష పత్రాలని పూర్తిగా చదివి రాయాలని, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి రమేష్ బాబు తెలిపారు. పదవ తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి రాయబోతున్న విద్యార్థులకి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి రమేష్ బాబు పలు సూచనలు చేశారు. వాహనదారులు ఎక్కడైన విద్యార్థులకు లిఫ్ట్ ఇవ్వాలని, అదేవిదంగా విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందుగా చేరుకోవాలి అని, వారి వెంట పెన్నులు, పెన్సిల్స్, హాల్ టికెట్ ఉంచుకోవాలని మరెవిదమైన ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండకూడదు అని తెలిపారు. పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలి అని వారికీ అల్ ది బెస్ట్ చెప్పారు.
Previous Post Next Post