సీఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగం 10 ప్రైవేట్ ఆసుపత్రుల మూసివేతకు ఉత్తర్వులు

 సీఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగం  

 10 ప్రైవేట్ ఆసుపత్రుల మూసివేతకు ఉత్తర్వులు

ఖమ్మం, ఏప్రిల్ 20 (మనఊరు ప్రతినిధి): నకిలీ చికిత్సలతో సీఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోంగం ఖమ్మంలో 10 ప్రైవేట్ ఆసుపత్రుల మూసివేతకు ఉత్తర్వులు అందజేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నిధులను దుర్వినియోగం చేసిన ఘోర అవినీతి స్కాం క్రమంగా వెలుగులోకి వస్తోంది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 10 ప్రైవేట్ ఆసుపత్రులు నకిలీ కేస్‌షీట్లు, బిల్లుల ఆధారంగా వేలాది రోగులకు చికిత్స చేసినట్టు కోట్లకు పైగా నిధులు అక్రమంగా వసూలు చేశాయని సమాచారం. మూసివేత ఉత్తర్వులు అందుకున్న పది ఆసుపత్రులు 1) శ్రీ వినాయక హాస్పిటల్ 2) శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 3) శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 4) వైష్ణవి హాస్పిటల్ 5) సుజాత హాస్పిటల్ 6) ఆరెంజ్ హాస్పిటల్ 7) న్యూ అమృత హాస్పిటల్ 8) మేఘశ్రీ హాస్పిటల్ 9) డాక్టర్ జే. ఆర్. ప్రసాద్ హాస్పిటల్ 10) గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వుల మేరకు ఆసుపత్రుల మూసివేత చర్యలు తీసుకుంటున్నట్లు డిఎంహెచ్ఓ కళావతిభాయి తెలిపారు.

Post a Comment

Previous Post Next Post