*ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు*
భక్తిశ్రద్ధలతో పాల్గొన్న భక్తులు.
నాగర్ కర్నూల్, మే 11 (మనఊరు ప్రతినిధి): పట్టణం కొల్లాపూర్ క్రాస్ రోడ్ వద్ద గల శ్రీ భక్త లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో ఆదివారం నాడు శ్రీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకం కుంకుమార్చనలు మరియు విశేష పూజలలో పాల్గొన్నారు.అనంతరం తీర్థ ప్రసాదాలు మరియు అన్నప్రసాదమును స్వీకరించారు.సామూహిక కుంకుమార్చనలలో పాల్గొన్న వారికి గురు మాత గారు కాశంశెట్టి విజయలక్ష్మి స్వామి గారు వెండి లక్ష్మీదేవి నాణాన్ని బహుమతిగా ఇచ్చారు. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో జయంతి వేడుకలలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని దేవాలయ కమిటీ వారు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.