పిడుగుపాటుకు పాడి ఆవు మృతి..
కేశంపేట, ఏప్రిల్ 20 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని నిర్ధవెళ్లి గ్రామానికి చెందిన బడక సత్యనారాయణ పాడి ఆవు పిడుగుపాటుకు గురై చనిపోయింది. ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. మెరుపులతో పిడుగు పడడంతో వ్యవసాయ పొలం వద్ద చెట్టు కింద ఉన్న సత్యనారాయణ ఆవు ఒక్కసారిగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృత్యు వాత పడింది. బడక సత్యనారాయణ రూ.80వేలతో ఆవు ను కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నట్లు తెలిపాడు. పాడిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆయనకు పాడి ఆవు మృతితో జీవనం కోల్పోయినట్లుంది. ప్రభుత్వం, దాతలు ముందుకు వచ్చి తనను ఆదుకోవాలని పాడి రైతు వేడుకుంటున్నారు.