గొప్ప సామాజిక సంస్కర్త, రాజనీతిజ్ఞుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

 గొప్ప సామాజిక సంస్కర్త, రాజనీతిజ్ఞుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

మానవ హక్కుల ప్రజా పరిరక్షణ సమితి చైర్ పర్సన్ డాక్టర్ హైమావతి


ఖమ్మం, ఏప్రిల్ 14 (మనఊరు ప్రతినిధి): భారతదేశ గొప్ప సామాజిక సంస్కర్త, రాజనీతజ్ఞుడు, ఆర్థిక వేత, భారత రాజ్యాంగ నిర్మాత,  స్వతంత్ర భారతదేశపు తొలి చట్ట మంత్రి  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, ఆయన జీవన విధానం నేటితరం నాయకులకు ఆదర్శనీయమని మానవ హక్కుల ప్రజా పరిరక్షణ సమితి జతి చైర్పర్సన్ డాక్టర్ చలమల హైమావతి అన్నారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతినీ పురస్కరించుకొని జిల్లాలోని పెనుబల్లి మండలం వంగముత్యాల బంజార గ్రామంలో మానవ హక్కుల ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు. మధ్యప్రదేశ్ లోని  మౌ అనే గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన  కొలంబియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి దేశ రాజ్యాంగాన్ని లిఖించే స్థాయికి ఎదిగారని తెలిపారు. శిక్షణ పొందండి- సంఘటితం కండి, మనమందరం సమానమే- సమాన హక్కులు ఉండాలి అనే నినాదాలతో దళిత బహుజన జాతిని జాగృతం చేసి, అన్ని రంగాలలో రాణించే విధంగా చైతన్య పరిచ్చారని అభిప్రాయపడ్డారు. ఆయన రచించిన రాజ్యాంగమే దేశానికి దిక్సూచి అయిందని, రాజ్యాంగ ఫలాలను దళిత బహుజనులు అనుభవించినప్పుడే ఆయన ఆశయ సాధనకు నిజమైన ఫలితం దక్కుతుందని అన్నారు. ఆయన అనుసరించిన విధానం, ఎదిగిన తీరు మనందరికీ ఆదర్శనీయమని, అన్ని వర్గాల ప్రజలు ఆయన సూచించిన మార్గంలో పయనించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post