అబ్బురపరిచిన శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం
షాద్ నగర్, ఏప్రిల్ 13 (మనఊరు ప్రతినిధి): మండలంలోని రామేశ్వరం క్షేత్రంలో రంగ క్షేత్ర కళా సంస్థ శ్రీ శివప్రసాద్ ఆద్వర్యంలో ఆదివారం రాత్రి శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకాల్లోని సన్నివేశాలను ప్రదర్శించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమానికి అతిథులుగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాదిమి శివకుమార్ శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం గురించి వివరించారు. హనుమాన్ జయంతి పురస్కరించుకొని రాత్రి రాయికల్ రామేశ్వర క్షేత్రంలో శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం నుండి యుద్ధఘట్టంలో ఆంజనేయుడి పాత్రతో అలరించిన కళాజ్యోతి రమేష్ విశ్వకర్మ ప్రేక్షకుల నుండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ అను నామ జపముతో ఆడిటోరియంలో భక్తుల కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమంలో కళాకారులు టీ.కృష్ణ, జి.కే.వెంకటేష్, బ్రహ్మచారి, తిరుపతయ్య, చిన్నరేవల్లి శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్, బలరాం, యాదగిరాచారి, వడ్ల రమేష్ చారి, తబలా ప్రవీణ్, పురుషోత్తమాచారి, పలు జిల్లాల సీనియర్ కళాకారులు, యువ కళాకారులు, పాల్గొన్నారు.