రిటైర్డ్ అధికారులు మాకొద్దు మహాప్రభో
-అవసరం అనుకుంటే అన్న అంశం ఆసరాగా మళ్ళీ రిటైర్డ్ ఉద్యోగులకు రెన్యువల్
-మాకొద్దంటూ పిసిసి అధ్యక్షుడు, మంత్రులు పొన్నం, ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఉద్యోగుల విన్నపాలు
మంత్రులను, పి.సి.సి ప్రెసిడెంట్ ను ఆదివారం కలిసి వినతిపత్రం ఇచ్చిన స్త్రీనిధి ఉద్యోగ నాయకులు:-
ప్రభుత్వం వివిధ శాఖలలో తొలగించిన రిటైర్డ్ ఉద్యోగులలో ఎవరిని తిరిగి తీసుకోకుండా నిర్ణయం తీసుకున్నారు, కానీ స్త్రీనిధి సమాఖ్యలో టెర్మినేట్ కాబడిన మేనేజింగ్ డైరెక్టర్ విద్యాసాగర్ రెడ్డి తిరిగి రెన్యువల్ తీసుకువచ్చారని సంస్థలో 14 సంవత్సరాలుగా ఆయన ఎం.డి గా కొనసాగుతున్నారని ఆయనపై పలు ఆరోపణల నేపథ్యంలో వేసిన ఎంక్వయిరీ ని అడ్డుకొని తిరిగి రెన్యువల్ తెచ్చుకున్నారని, ఇటీవల తొలగించిన రిటైర్డ్ ఉద్యోగులు, విద్యాసాగర్ రెడ్డి కూడా టర్మినేట్ చేయబడినప్పటికీ సంస్థ బాధ్యతలు పూర్తిస్థాయిలో వేరొకరికి అప్పగించకపోవడం, తిరిగి ఆయనకే రెన్యువల్ ఇచ్చారని, ఇతర రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగించే ప్రయత్నo నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారని విద్యాసాగర్ రెడ్డి రెన్యువల్ రద్దు చేసి 5000 కోట్ల స్త్రీనిధి సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా ఐ.ఏ.ఎస్ స్థాయి అధికారికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పజెప్పేలా ప్రభుత్వానికి సూచించడంతో పాటు స్త్రీనిది ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో మద్దతుగా నిలవాలని స్త్రీనిధి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగపూర్ రాము,శంకర్ ఇతర ఉద్యోగులు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డికిి, బి.సి సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ని, పి.సి.సి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ని కోరారు.