అంగరంగ వైభవంగా సీతారాముల ఆలయ ధ్వజస్తంభం ఊరేగింపు...

 అంగరంగ వైభవంగా సీతారాముల ఆలయ ధ్వజస్తంభం ఊరేగింపు... 

ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు.. 

వేలాది సంఖ్యలో తిలకించిన భక్తులు.. 

పెద్ద శంకరంపేట్,ఏప్రిల్ 13 (మనఊరు ప్రతినిధి): శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణం లో పునః విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలలో భాగంగా పెద్ద శంకరంపేటలో ఆదివారం సాయంత్రం తిరుమలాపూర్ ఆంజనేయస్వామి దేవాలయం నుండి సీతారాముల దేవాలయ ధ్వజస్తంభం ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు.. ధ్వజస్తంభం శోభాయాత్రలో భాగంగా చేపట్టిన పలు సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.. కేరళ బృందం వారి వైద్య బృందం చేపట్టిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది.. హైదరాబాద్ డాక్టర్ ఐశ్వర్య రెడ్డి ఆధ్వర్యంలో సాయి తుంబుర వారి కూచిపూడి నృత్యాలు.. భారీ హనుమాన్ విగ్రహం ఆకర్షణగా నిలిచాయి.. పెద్ద శంకరంపేటకు చెందిన మహిళల ప్రత్యేక కోలాటాలు.. పురుషుల కోలాటాలు మధ్య శోభాయాత్ర పట్టణ పురవీధుల గుండా కన్నుల పండుగగా జరిగింది.. మహిళలు ఆడపడుచులు ప్రత్యేక మంగళహారతులతో ధ్వజస్తంభం ముందు నడవగా పురవీధుల గుండా శోభాయాత్రలో ధ్వజస్తంభంపై ఇరువైపుల నుండి మహిళలు ప్రజలు పూల వర్షం కురిపించారు.. అన్ని రకాల కళా ప్రదర్శనలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ అధ్యక్షులు గుజ్జరి కనకరాజు.. ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post