ఘనంగా మట్టల ఆదివారం

 ఘనంగా మట్టల ఆదివారం



జడ్చర్ల రూరల్, ఏప్రిల్ 13 (మనఊరు ప్రతినిధి): గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆదివారముకి ముందు ప్రపంచవ్యాప్తంగా మట్టల ఆదివారం కార్యక్రమం నిర్వహిస్తారు. జడ్చర్ల బేతని ఎం.బి.చర్చ్ సండే స్కూల్ వారి ఆధ్వర్యంలో పాస్టర్ కె. విలియం బూత్ ప్రార్థనతో ర్యాలీ ప్రారంభించినారు. జడ్చర్ల పుర వీధుల గుండా క్రీస్తు జయ నినాదాలతో త్వరలో రానున్న ఏసుక్రీస్తుకి జై రాజులకు రారాజు యేసుకి జై అని నినదిస్తూ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడేకంటే ముందు యేరుషలేము పురవీధుల గుండా గాడిద పైన ఊరేగిస్తూ మట్టలు చేత పట్టుకుని ,వస్త్రాలు కింద పరుస్తూ విజయ నాదాలు చేస్తూ వెళ్లిన సంఘటన గుర్తుచేస్తూ చిన్నారులు పాటలు పాడుతూ జడ్చర్ల పట్టణం లో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు జి.సి.ఫిలమోన్ సండే స్కూల్ సూపర్డెంట్ సౌమ్య సుశాంత్, అసిస్టెంట్ సూపర్డెంట్ నవరత్న కుమారి, సండే స్కూల్ టీచర్లు హిమరాణి, సుస్వేత, వెన్నెల కృపాకర్, శ్రేష్ట, శైలజ ,రీనా, పల్లవి, వనిత, పింకీ ,టోనీ విల్సన్, క్రిష్టి, జాన్ ఆస్టిన్ ,అలెక్స్, జీవన్, సాంసన్, దయమని, శారా సామ్యూల్, యూత్ అధ్యక్షులు సుస్మిత్, కార్యదర్శి బన్నీ రాజ్, కోశాధికారి రాజు, సందీప్, అరుణ్, యాకోబు, జయరాజ్, డ్యాని, డేవిడ్, వినోద్ ,వెంకటేష్, తేజ, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post