* _రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టుకు 16 నెలల్లో ఆరుగురు సీఈవోల మార్పు._*
*_ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సీఈవోగా పనిచేసేందుకు ఇష్టపడని ఐఏఎస్ అధికారులు._*
_ఖాళీగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో పోస్టు._
_కనీసం ఇన్‌చార్జ్ లేక.. సీఈవో లేక ఆగిన 1300 మంది వేతనాలు._
_ఆస్పత్రులకు సైతం నిలిచిపోయిన చెల్లింపులు._
_కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల్లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోలుగా ఆరుగురు ఐఏఎస్ అధికారులు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం జరిగింది._
_ప్రైవేటు ఆస్పత్రులకు ప్రతినెలా కనీసం రూ.90-100కోట్ల బిల్లులు చెల్లిస్తుండగా.. ప్రస్తుతం ఇవి నిలిచిపోయినట్లు వెల్లడించిన ఆరోగ్యశ్రీ అనుసంధాన ప్రైవేటు ఆస్పత్రుల వర్గాలు._