యువత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

 యువత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

తెలంగాణ రాష్ట్ర సిఎస్సి కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ పివిపి అంజనీకుమారి


సత్తనపల్లి, మే 14 (మనఊరుఙఙప్రతినిధి): యువత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సిఎస్సి కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ పివిపి అంజనీకుమారి అన్నారు. బుధవారం సత్తనపల్లి పట్టణంలో హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు పట్టణంలోని టీచర్స్ మస్తాన్ ఐటిఐ కళాశాల నందు జాబ్ మేళా హాజరై ఆమె మాట్లాడుతూ యువత దేశ సంపదని చదువుకున్న ప్రతి వ్యక్తి తన చదువును సార్ధకం చేసుకునే క్రమంలో సంపాదన అనేది ఎంతో ముఖ్యమైనదని నీ చదివే నీ జీవితానికి ఒక మార్గంలా పనిచేస్తుందని , యువత సమయాన్ని చదువుకున్న చదువుని సక్రమంగా ఉపయోగించుకున్నప్పుడు ఉన్నతమైన స్థితిని పొందవచ్చునని .చిన్ననాటి నుంచి చదువుపట్ల మక్కువ కలిగి తక్కువ సమయంలో స్థిరపడినప్పుడు భవిష్యత్తు ఎంతో బాగుంటుందని దాని ద్వారా కుటుంబానికి సమాజానికి ఎంతో ఉపయోగ పడవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఆపరేషన్ సింధూర్ లో వీర మరణం పొందిన సైనికులకు నివాళులర్పించి యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువత సుమారుగా 180 మంది హాజరయ్యారు. కార్యక్రమానికి హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కంచర్ల బుల్లిబాబు అధ్యక్షత వహించారు. 17 వివిధ కంపెనీలలో ఎన్నిక కావడం జరిగింది. . ఇంకా ఈ కార్యక్రమంలో స్కిల్ హబ్ ట్రైనింగ్ సెంటర్ కోఆర్డినేటర్ రామకృష్ణారెడ్డి బాల ఆదిత్య డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెంకటేష్ , వినుకొండ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ ఏసయ్య యువతి యువకులు గుంటూరు జిల్లా హెల్ప్ ఫౌండేషన్ మహిళా అధ్యక్షురాలు సునీత పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు సౌజన్య, ఉమ్మడి గుంటూరు జిల్లా హెల్ప్ ఫౌండేషన్ అధ్యక్షులు కంచర్ల కృష్ణ , టీచర్స్ మస్తాన్ ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post