నేడు ఉచిత మెడికల్ హెల్త్ క్యాంప్ ని విజయవంతం చేయండి
దేవరకద్ర, మే 3 (మనఊరు ప్రతినిధి): దేవరకద్ర మండల కేంద్రంలో ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మేఘ మెడికల్ హెల్త్ క్యాంపు అలాగే రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు సోషల్ మీడియా ఇంచార్జ్ గోవర్ధన్ నాయీ తెలిపారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు అపోలో యశోద, మహబూబ్ నగర్ ఎస్ వి ఎస్ ఆసుపత్రి సౌజన్యంతో హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ మెడికల్ క్యాంపులో ప్రత్యేక వసాతులతో పాటుగా చెవి ముక్కు గొంతు సమస్యలతో మోకాళ్ళ కీళ్ల నొప్పులు గురించి అంత సమస్యలను కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ఉచిత మెడికల్ హెల్త్ క్యాంపు ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.