పరమాత్ముడే పాద సేవ చేసుకునే గొప్పతనం అమ్మది

 _*పరమాత్ముడే పాద సేవ చేసుకునే గొప్పతనం అమ్మది*_

 _*తల్లిదండ్రులను గౌరవిద్దాం*_

      _*అమ్మను కాపాడుకుందాం*_

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి


ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అమ్మతో చిన్ననాటి ఫోటో 



 వనపర్తి, మే 11 (మనఊరు ప్రతినిధి): సాక్షాత్తు పరమాత్పుడే పాద సేవ చేసుకునే గొప్పతనం అమ్మదని అలాంటి అమ్మను గౌరవించుకుని పూజించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.

 ఆదివారం మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

తన ప్రాణం పణంగా పెట్టి మనకు ప్రాణం పోసి ప్రయోజకులను చేసిన అమ్మలను అనాధలుగా వదిలేయరాదని ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గౌరవించి వారి ఆఖరి రోజుల్లో అండగా ఉండాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఉరుకుల పరుగుల జీవితంలో కన్న తల్లిదండ్రులను కనుక్కున్న బిడ్డలను నిర్లక్ష్యం చేయరాదన్నారు*_

 పిల్లలకు చిన్ననాటి నుంచి తల్లిదండ్రుల పట్ల భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో ఉండేలా చూడాలన్నారు.

Post a Comment

Previous Post Next Post