గ్రామములలో జానపదం అంటే జనం నివసించే పల్లెటూరు
ఎన్. టి. ఆర్ జిల్లా తిరువూరు, మే 11 (మనఊరు ప్రతినిధి): గ్రామములలో జానపదం అంటే అర్థం జనం నివసించే పల్లెటూరు అని తిరువూరు సీఐ వేణుగోపాల వెంకట సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఎన్. టి. ఆర్ జిల్లా తిరువూరు మండలం మల్లెల గ్రామములో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన కళాకారులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ ఈ జనపదాల్లో పుట్టినవే జానపద కళలు. ఇవి ఒక ప్రాంతంలోని వ్యక్తుల సమూహానికి సంబంధించినవి. ఈ కళల్లో ప్రదర్శన ఒక్కరుగా లేదా వ్యక్తుల సమూహంగా ఇస్తారని అన్నారు. ఈ రకమైన కళలు ఒక తరం నుంచి మరో తరానికి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాప్తి చెందుతున్నట్టు తెలిపారు. ఇప్పటి రోజుల్లో టీ.వీ, సినిమాలు, సోషల్ మీడియా, రికార్డింగ్ డ్యాన్సుల మైకంలో పడిన ప్రజలకు ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ విలువ తెలియట్లేదేమో కానీ, ఒకప్పుడు ఊరిలో బుర్రకథ ఉందంటే చాలు పిల్లా పిచ్చుకతో సహా ఊరు ఊరంతా ఆ స్టేజి ముందే వాలిపోయేవారని అన్నారు.
డాక్టర్ ప్రత్తిపాటి లక్ష్మీకాంతమ్మ గ్రామములలో ఒకప్పుడు నిత్యం ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతూ ఉండేవి. అలాంటి కళలు కనుమరుగు అవుతున్న సమయములో బుర్రకథ కళాకారుల జానపద కళాకారుల సమావేశము ఏర్పాటు చేసి 90 మంది ప్రసిద్ధి చెందిన కళాకారులను ఒకచోట చేర్చి వారిని సన్మానించుకోవడం ఎంతైనా అభినందించదగిన విషయమన్నారు. మాస్ స్వచ్ఛందను స్తాపించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ గౌరవ డాక్టరేట్ పొందారని గుర్తు చేశారు. అదేవిధంగా తన లాగే ఎంతో ప్రతిభ ఉండి గుర్తింపుకు నోచుకొని కళాకారులను ఒకచోట చేర్చి వారిని తగు రీతిలో సేకరించాలని చేపట్టినదే కళాకారుల సన్మాన కార్యక్రమం అని అన్నారు. మాస్ స్వచ్ఛంద సంస్థ ఈ సంస్థ డైరెక్టర్, స్వయంగా కళాకారిణి అయిన డాక్టర్ ప్రత్తిపాటి లక్ష్మీ కాంతమ్మ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెనాలి సీనియర్ కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్ ఎన్ ఆర్ డి పి ఆర్ డాక్టర్ దాసరి ఏడు కొండలు మాట్లాడుతూ నిద్ర పోతూ కనేది కల, నిద్రపోతున్న వాడిని మేల్కొలిపేది కళ అని తెలిపారు. ఇంతటి గొప్ప కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, కళలను సమాజం కూడా ప్రోత్సహించాలని లేకుంటే కళలు అంతరించి పోతాయని అన్నారు. కవి, రచయిత జాతీయ అధ్యక్షులు పుడమి సాహితి వేదిక నల్గొండ సభాధ్యక్షులు డాక్టర్ చిలుముల బాలిరెడ్డి ఈ కార్యక్రమంలో ఏఎస్సై పల్లె కిషోర్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ తబలా ప్లేయర్, తెలుగు నాటక రంగ పద్యాలు స్టేజి సింగర్ వంగూరు సర్పంచ్ మరియమ్మ,
డాక్టర్ దాసరి ఏడుకొండలు, డి కమల్ రెడ్డి, జి ఆర్ హెల్పింగ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముల్లంగి పద్మ, నేషనల్ హ్యూమన్ రైట్స్ సి ఎస్ ఐ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రాష్ట్ర మహిళా విభాగం బి ప్రేమ్ రాజ్, మాజీ సర్పంచ్, ఉమ్మడి కృష్ణాజిల్లా బుర్రకథ కళాకారుల సంక్షేమ సమాఖ్య కార్యదర్శి ఏసుదాసు, కోశాధికారులు వసంతరావు, జానపద కళాకారులు రవి కుమార్. కళాకారులు రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.