అంతర్జాతీయ కొవ్వొత్తుల స్మారక దినోత్సవ ర్యాలీ
ఎయిడ్స్ వ్యాధి మృతులకు సంఘీభావ ర్యాలీ....
నాగర్ కర్నూల్, మే 18 (మనఊరు ప్రతినిధి): జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నాడు సాయంత్రం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో హెచ్ఐవి/ఎయిడ్స్ వ్యాధితో చనిపోయిన వారి స్మారకార్థం అంతర్జాతీయ కొవ్వొత్తుల స్మారక ర్యాలీ నిర్వహించారు. ప్రతి సంవత్సరం మే నెలమూడో ఆదివారం రోజు హెచ్ఐవి, ఎయిడ్స్ తో చనిపోయిన వారి స్మారకార్థం మరియు సంఘీభావం కోసం ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. మృతుల సంఘీభావ నిమిత్తం వారికి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో దిశా క్లస్టర్ మేనేజర్ రమేష్, డిపిఎంవో పి. సుకుమార్ రెడ్డి, జిల్లా ఫార్మసీ సూపర్వైజర్ సురేష్ కుమార్, ఐ సి టి సి కౌన్సిలర్ శివశంకర్, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలైన ఎం ఆర్ డి ఎస్, వై ఆర్ జి కె బృంద సభ్యులు పాల్గొన్నారు.