మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై కెసిఆర్, కేటీఆర్ వెంటనే చర్యలు తీసుకోవాలి
_*భూ కబ్జాదారుడిని సమర్థిస్తారా సస్పెండ్ చేస్తారా*
_*భూ కబ్జాలు నిజమేనని నిరూపించిన ఎమ్మెల్యేమేఘారెడ్డి*_
_*విలేకరుల సమావేశంలో కబ్జాలకు సంబంధించిన ఆధారాలను వెల్లడించిన ఎమ్మెల్యే*_
వనపర్తి, మే 118 (మనఊరు ప్రతినిధి): భూ కబ్జాలకు మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా ఆసుపత్రిని క్యాంపు జిల్లా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జోగులాంబ గద్వాల, మనోపాడు ద్వారా చందూర్ గ్రామంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బినామీల పేర్లపై సర్వే 57లోని 2ఎకరాల 19 గుంటలు భూమిని భూ ఖజా నిజమేనని నిర్ధారణ కావడంతో నెంబర్ శాఖ అధికారులు, అక్రమణదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సేవ్ వనపర్తి-చేంజ్ వనపర్తి నినాదంతో ఆత్మగౌరవం కాపాడుకునేందుకు తనకు అండగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అవినీతి, భూకబ్జాలను నిరూపించడంలో భాగంగా విజిలెన్స్ ఎంఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ సూచన మేరకు గద్వాల్ జిల్లా కలెక్టర్‌తో పాటు, నీటిపారుదల శాఖ అధికారులకు సర్వే నిర్వహించండి హద్దులు ఏర్పాటు చేశారన్నారు. తాను కబ్జాలకు లేదని ఎన్నికల ముందు నిరూపించాలని సవాల్ విసిరిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు ఎప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తనపై వ్యక్తిగత దూషణలకు దిగిన తాను ఎన్నడూ ఎదుటి వ్యక్తిపై వ్యక్తిగత దూషణలకు దిగలేదని ఆయన స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి రూ 22 2400 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి చుక్క నీరు అందలేదని. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు తొంబై శాతం పూర్తయ్యాయని చెప్పుకుంటున్న బీఆర్ ఎస్ నాయకులు తాను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో మాట్లాడి రూ.2700 కోట్లు విడుదల చేయిస్తాను పూర్తి చేసి చూపాలని సవాల్ విసిరారు. పదహారు నెలల తన పాలనలో వనపర్తి నియోజకవర్గానికి రూ.వెయ్యి కోట్ల విలువ గల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశానని గుర్తు చేశారు. భవిష్యత్తులో వనపర్తి నియోజకవర్గంలో సాగునీటి సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ. 12 లక్షల కోట్లతో చెరువుల పునరుద్ధరణ సాగునీటికి ప్రాజెక్టుల నివేదికలను సిద్ధం చేశామన్నారు. సీజన్‌లో రికార్డు స్థాయిలో 3 లక్షల 90 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతులు పండించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ రైతులపై ముసలి కన్నీరు చూపేందుకు ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం హయాంలో చేసిన నిర్వాకం వల్లే నేడు మిల్లర్లు రూ 700 కోట్లు బకాయిలు పడ్డారని ఈ పాపం ఎవరిదని ఆయన ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోళ్లలో చివరి గింజ వరకు కొంటామని అన్నదాతలు ఎవరు అధైర్య పడవద్దని ఆయన సూచించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో అవినీతి లేని అభివృద్ధిని చేసి చూపిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పీసీసీ సభ్యులు శంకర్ ప్రసాద్, జిల్లా దిశ కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ పట్టణ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, పనిచేస్తున్నారు.