వైభవోపేతంగా శిఖర కలశ ప్రతిష్ట

 వైభవోపేతంగా శిఖర కలశ ప్రతిష్ట 

హాజరైన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి 













జడ్చర్ల రూరల్, మే 18 (మనఊరు ప్రతినిధి): మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేటలో ఐబి (డాక్) బంగ్లా సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ బంగారు మైసమ్మ తల్లి గోపుర శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా పుణ్యాహవాచనం, గణపతి పూజ, గౌరీ, వాస్తు, నవగ్రహ, కలశ స్థాపన, స్థాపిత దేవతా హోమాలు, శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవతకు అభిషేక ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.

కలశ ప్రతిష్టకు హాజరైన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి 

శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవానికి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి. దేవాలయ మర్యాదలతో దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం శిఖర కలశ దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత, కౌన్సిలర్లు బుక్క మహేష్, చైతన్య చౌహన్, జ్యోతి రెడ్డి, కుమ్మరి రాజు, సతీష్, దేవా, మాజీ సర్పంచ్ బుక్క వెంకటేశం, పిఎస్‌ఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు రామ్మోహన్, పిట్టల మురళి, పతి రెడ్డి, కోనేటి నరసింహులు, కృష్ణారెడ్డి, కరాటే శ్రీను, శ్రీకాంత్, శంకర్ నాయక్, కాంగ్రెస్ నాయకులు రమేష్ యాదవ్, గుండు చంద్రమౌళి, జగదీష్ చారి, దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గుండు చంద్రశేఖర్, గోనెల నరేందర్ మహేశ్వరి, విజయ్ కుమార్ గౌతమి, మిద్దె నాగరాజు చంద్రకళ, గోనెల నరేష్ రాఘవేణి దంపతులతోపాటు పండ్ల దేవరాజు, గుండు శ్రీశైలం, బుక్క శివ కుమార్, బుక్క రమేష్, చిక్క శేఖర్, జయ శ్రీ వాత్సవ్, భవిత్ రాజ్, భక్తులు, మహిళా భక్తులు ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post