స్వశక్తితో సంగీతంలో పట్టు సాధించాలి
హైదరాబాద్, మే 3 (మనఊరు ప్రతినిధి): అలియాడ్ ఆర్టిస్ట్ ఆడిటోరియం, హిమాయత్ నగర్ నందు జరిగిన కార్యక్రమం లో మెలోడీ, రొమాంటిక్ సింగర్ ఇందిర ఆర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఎన్. ఇందిరకి 12 గంటల తెలుగు తమిళ్ హిందీ సుదీర్ఘ సినీ గాన లహరి లో ఇంటర్ నేషనల్ వండర్ బుక్ అఫ్ రికార్డ్ - 2025 ను సంస్థ ఇంటర్ నేషనల్ చీఫ్ కో ఆర్డినేటర్ డాక్టర్ బింగి నరేందర్ గౌడ్ అందజేసి మాట్లాడుతూ మహిళ స్వశక్తితో సాధనతో సంగీతం లో పట్టు సాధించి విజయం సాధించిన రికార్డు ను అందజేసి డా. ఎన్.ఇందిర గారిని అభినందించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా విచ్చేసిన సిటీ సివిల్ కోర్ట్ సీనియర్ సూపరింటెండెంట్ డా. పీ.వీ.పీ. అంజనీ కుమారి మాట్లాడుతూ కృషి పట్టుదల, నిరంతర కృషి సాధనతో రికార్డు ను సొంత చేసుకున్న గాయని డా. ఎన్. ఇందిర గారిని అభినందిస్తూ మునుముందు మరెన్నో రికార్డులను సాధించాలని ఆకాంక్షించారు. గౌరవ అతిధిగా డాక్టర్ రామకృష్ణ చంద్రమౌళి రికార్డ్ సాధించిన డా. ఎన్. ఇందిర గారికి రివార్డ్ అందజేస్తూ భవిష్యత్ లో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభినందనలు తెలిపారు.ఆత్మీయ అతిధి సినీ నిర్మాత విజయ చిత్ర సినీ ఈ పత్రిక ఎడిటర్ మాట్లాడుతూ సంతోషం ఆనందం కలిగించే కార్యక్రమం గాన లహరి లో 12 గంటల రికార్డును గెలుచుకున్న ఇందిర గారి విజయాన్ని పొగిడారు.ఈ కార్యక్రమంలో గాయకులు డాక్టర్ ఆలూరి విల్సన్, బైరి శ్రీనివాస్, జి. శ్రీనివాస్, శ్రీనివాస్ నాయుడు, ప్రభాకర్, రవికిరణ్ పాల్గొన్నారు.