మజ్జిగ, చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్ నగర్, మే 4 (మనఊరు ప్రతినిధి): షాద్ నగర్ గంజ్ లో కాంగ్రెస్ పార్టీ 20వ వార్డు నేత. మన్నే జానకి రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మజ్జిగ, చలివేంద్రాన్ని ఆదివారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండే ఎండలు, వడగాడ్పుల నేపధ్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయటం హర్షనీయమన్నారు. సేవలను కొనియాడుతూ, నిర్వహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, సీనియర్ నాయకుడు అగ్గనూర్ బస్వo, జృమద్ ఖాన్, కొమ్ము కృష్ణ, నర్సింహులు, ప్రదీప్ మరోటీయ, భరత్ లోహటి, వాసు, మనీష్, తదితరులు పాల్గొన్నారు.