నేడు లట్టుపల్లిలో లక్ష్మీ గణపతి, పంచముఖ ఆంజనేయ స్వామి, నవగ్రహ దేవత ప్రతిష్టా కార్యక్రమం

 *నేడు లట్టుపల్లిలో లక్ష్మీ గణపతి, పంచముఖ ఆంజనేయ స్వామి, నవగ్రహ దేవత ప్రతిష్టా కార్యక్రమం*





బిజినెపల్లి, మే 8 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని లట్టుపల్లి గ్రామంలో శ్రీ నాగజ్యోతిశ్వర దేవాలయ ప్రాంగణంలో నూతనంగా పలు విగ్రహాల లక్ష్మీ గణపతి దేవసేన నాగ ప్రతిష్ట పంచముఖ ఆంజనేయ స్వామి, నవగ్రహల ప్రతిష్ట, ధ్వజస్తంభం, శ్రీవల్లి దేవసేన, పాలు దేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆకుల సిద్దయ్య తెలిపారు. శుక్రవారం నాడు ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక ప్రాణ ప్రతిష్ట పూజలు ఉన్నట్లు తెలిపారు.‌ ఈ కార్యక్రమంలో భాగవత్ బంధువులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించాలని కోరారు. గురువారం నాడు శనేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వ మఠం విశ్వనాథ శాస్త్రి గణపతి పూజ, మంటప దేవార్చనలు ప్రత్యేక హోమాలు, పలపుష్పాది వాసము, మంటప దేవత విశేష అర్చనలు, ఆదిత్యాది నవగ్రహ హోమాలు, జలాధివాసము దాన్యాధివాసము, వేదమంత్రోచరణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూలమంత్ర జపము వేద అర్చక బృందం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శుక్రవారం నాడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనంతరం శివపార్వతుల కళ్యాణం ఉన్నట్లు తెలిపారు. పాల్గొన్న భక్తులందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాంత భక్తులు భక్తిశ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Post a Comment

Previous Post Next Post