తెలుగు వాళ్ళ జీవ నాడి తెలుగు భాష

 తెలుగు వాళ్ళ జీవ నాడి తెలుగు భాష

 మాతృభాషను బతికించుకుందాం, మాతృభాష కోసం కృషి చేద్దాం... 

ప్రముఖ సామాజికవేత్త, సిటీ స్మాల్ కాసెస్ కోర్ట్, సీనియర్ సుపరిండెంటెట్ పీవీపీ అంజనీ కుమారి






హైదరాబాద్, మే 8 (మనఊరు ప్రతినిధి): తెలుగు వాళ్ళ జీవ నాడి తెలుగు భాష మాతృభాషను బతికించుకుందాం, మాతృభాష కోసం కృషి చేద్దామని ప్రముఖ సామాజికవేత్త, సిటీ స్మాల్ కాసెస్ కోర్ట్, సీనియర్ సుపరిండెంటెట్ పీవీపీ అంజనీ కుమారి అన్నారు. హైదరాబాద్ లోని త్యాగరాయ గానసభలో తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వర్యంలో 12వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడుతూ తెలుగు భాషకు పట్టాభిషేకం....... తెలుగు భాష ఘన కీర్తి చెప్పుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఆచరణలో శూన్యం, ఈ అంతర్జాతీయ కవి సమ్మేళనం లో .. తెలుగు భాష పట్టాభిషేకం కార్యక్రమం జరుగుతున్నది .... కానీ భాష అభివృద్ధి అనేది నోచుకోవడం లేదు, మన కన్న తల్లి కంటే గొప్పది మనం జన్మించిన జన్మభూమి, మాతృమూర్తి కంటే గొప్పది మన భాష.. పరభాష యా మొహం లో సంప్రదాయాలు కట్ట బాట్లు దూరముగా కన్న తల్లిదండ్రులని ఎలాగు మర్చి పోతున్నాము ,మనం మాతృభాషను కూడా మనం దూరంలో ఉంచుతున్నాము, కుటుంబం మధ్య సంభాషణ కూడా తెలుగు తనము అనేది దూరము లో ఉంటుంది ,ఈరోజు చూడండి తెలుగు భాష పట్టాభిషేకానికి వచ్చిన కవులు కళాకారులు సాహిత్య వేత్తలు తెలుగు భాష పై మక్కువ ఉన్న అభిమానులు చూస్తుంటే ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది ఇలాంటి వాతావరణాన్ని నేను మన శ్రీశైలం దగ్గర ఉన్న లింగాలు అనే ఒక మారుమూల గ్రామంలో చూశాను చూస్తానికి అది గ్రామమే కానీ ప్రతి ఒక్క ఇంట్లో చదువుకొని ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఉద్యోగం చేసే తెలుగు వాళ్ళు తెలుగే మాట్లాడేవాళ్లు నేను ఆ గ్రామంలో చూశాను అంతకు ముందు రోజు సాయంత్రం ఒక సభ ఆ గ్రామంలో జరిగినది నేను కూడా హైదరాబాదు నుండి నా స్నేహితులు పిలవడం మూలంగా ఆ సభకు నేను కూడా వెళ్లడం జరిగినది, అక్కడ కొన్ని వందల మంది చుట్టుపక్కల గ్రామాలు వచ్చి ఆ ఊరి ని చుట్టేశారు, అసలు ఇక్కడ ఏమి జరుగుతున్నది ఇంతమంది జన సమూహం కి కారణం? మీ ఎమ్మెల్యే వస్తున్నారా? ఆయనకి ఇంత ఘన స్వాగతం పలుకుతున్నారా? అన్నాను కానీ ఆ ఊరి పెద్దలు లేదమ్మా నిలువెల్లా తెలుగుతనముతో తెలుగు భాషలో తన గొంతు నుండి వచ్చే సాహిత్యాన్ని తెలుగు భాష నిండుతనాన్ని వినడానికి వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు భాష విభాగంలో పనిచేస్తున్న కాసిం మా ఊరికి వస్తున్నారు. ఆయన కోసం వచ్చినారు, మీరందరూ అన్నారు, ఆ తర్వాత ఆయన రావడం తెలుగులో మాట్లాడటం జరిగినది. ఆరోజు చూసిన కాసిం కూడా ఈరోజు ఇదే సభలో వేదిక మీద ఉన్నారు. అదే కాసింతో చదువుకున్న బడా సాబ్ మనకోసం తెలుగు భాషాభివృద్ధి కోసం పాటుపడుతూ ఆయన కూడా ఇదే వేదిక మీద పాలు పంచుకుంటున్నారు. బడా సాబ్ మాతృభూమి కంటే గొప్పది కన్నతల్లి కన్నతల్లి కంటే గొప్పది మాతృభాష అనే నివాదంతో ఆయన జీవితాన్ని తెలుగు భాష తెలుగు సాహిత్యం వైపుపెట్టి భాషాభివృద్ధికి కోసం కృషి చేస్తున్నారు. డబ్బు ఎవరి దగ్గరైనా ఉంటుంది, కానీ కృషి పట్టుదల భాషాభివృద్ధి మాతృభూమి కోసం చూసేవాళ్ళు చాలా అరుదు, మరి అలాంటి బడా సాబ్ మనకు దొరకటం సాహిత్య వ్యక్తుల కవుల రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గొప్ప విషయము , అంతరించిపోతున్న తెలుగు భాషను ఊపిరి పోసి సమాజంలో నిలబెట్టాలి అనే ఆలోచన గల మహానుభావుడు బడా సాబ్, ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తూ ఆయన చేయబోయే కార్యక్రమాల్లో మన వంతుగా ఆయన చేయు కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. తెలుగు భాషను బతికిద్దాం తెలుగులోనే మాట్లాడదాం తెలుగు భాషాభివృద్ధికి కృషి చేద్దాం, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంత గొప్పవారు మరి మన మాతృభూమి మాతృభాష అంతకంటే గొప్పది, భాషను బతికించుకోవడానికి , భాషాభివృద్ధికి మనందరం కృషి చేస్తాము రాష్ట్ర సాంస్కృతిక శాఖ మరియుతెలుగు భాష చైతన్య సమితి, లక్ష్యం సాధన ఫౌండేషన్ తెలుగు భాష అభివృద్ధి కోసం ఈరోజు తెలుగు భాషకి పట్టాభిషేకం అనే నివాదంతో ముందుకు వచ్చారు. వారితో మనము కూడా కలిసి కర్మ కర్త క్రియ అయినా బడా సాబు గారికి మన వంతు చేయూతనిస్తూ భాషాభివృద్ధికి కృషి చేద్దాము, వేదిక మీద ఉన్న పెద్దలు, సాహిత్య వేత్తలు, కవులు, కళాకారులు, నాకు అవకాశం కల్పించిన ఈ కార్యక్రమం పెద్దలు చంద్రమౌళికి, లక్ష్యసాధన కమిటీ వారికి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు - వెలుగు జాతీయ అధ్యక్షులు మోటూరి నారాయణ రావు, పాలడుగు నాగయ్య కళాపీఠం అధ్యక్షురాలు సరోజినీ దేవి, సుమ ధర్మన్న కళా పీఠం అధ్యక్షురాలు రాధా కుసుమ, మానస ఆర్ట్స్ అధ్యక్షులు థియేటర్ రఘుశ్రీ, గోల్కొండ సాహితీ కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అర్ధ చంద్ర ప్రకాశరెడ్డి, చినుకు వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్.ఎన్.మూర్తి, సాహితీ వీణ కుసుమాలు అధ్యక్షురాలు సత్య వీణ మొండ్రేటి, అరుణోదయ సాహితి అధ్యక్షురాలు డాక్టర్ అరుణ కొడాటి, అక్షర కౌముది అధ్యక్షులు తులసి వేంకట రమణ, ఫ్రెండ్స్ ఫర్ సోషల్ అధ్యక్షురాలు అంజనీ కుమారి, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post