తలసీమియాను తరిమేద్దాం

 తలసీమియాను తరిమేద్దాం 

ప్రపంచ తలసీమియా అవగాహన ర్యాలీ 

 జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఉప అధికారి డాక్టర్ ఎం వెంకటదాస్ 



నాగర్ కర్నూల్, మే 8 (మనఊరు ప్రతినిధి): తలసే మియా వ్యాధిని తరిమేద్దామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఉప అధికారి డాక్టర్ ఎం వెంకటదాస్ అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ కార్యాలయం (పాత పాత కలెక్టరేట్) ప్రాంగణంలో ప్రపంచ తలసీమియా అవగాహన ర్యాలీని ఉప జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం వెంకట దాసు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ వెంకట దాసు మాట్లాడుతూ తల సేమియా అనేది జన్యుపరమైన రక్త రుగ్మత అని తెలియజేశారు. తల సీమియా వ్యాధికి కారణమైన  జన్యుపరమైన లోపం కల తల్లిదండ్రుల ద్వారా వారి సంతానానికి సంక్రమిస్తుంది.  తలసిమియా వ్యాధి గల చిన్నారులు అలసిపోవడం, పెరుగుదల లోపించడం, తరచుగా అంటువ్యాధులకు గురి కావడం, హిమోగ్లోబిన్ రెండు నుంచి మూడు గ్రాములు మాత్రమే ఉంటుంది, శరీరంలో కాలేయము, ప్లీహము పెద్దగా అవ్వడం, కడుపు ఉబ్బిపోవడం తదితర లక్షణాలతో బాధపడుతుంటారు. వీరికి  ప్రతినెలా రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతినెల రక్త పరీక్షలు పరీక్షలు  చేయాలి, శరీరంలో ఐరన్ నిల్వలు ఎక్కువ అవడం వలన మెదడు, గుండె, కాలేయము, మూత్రపిండాలు తదితరభయాలు ప్రభావితం అవుతాయి. ఐరన్ నిల్వల్ తగ్గడానికి ప్రతి నెల మందులు వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తలసిమియా వ్యాధి గల చిన్నారులకు రక్తసంబంధికుల  ద్వారా సేకరించిన  ఎముక మజ్జ మార్పిడి ద్వారానే  పూర్తి పరిష్కారం లభిస్తుంది. ఎముక మజ్జ మార్పిడికి పది నుంచి పదిహేను లక్షల దాకా ఖర్చవుతుందని, కేవలం సులభమైన రక్త పరీక్ష ద్వారా తలసీమియా వ్యాధిని నిర్ధారించుకోవచ్చన్నారు. మేనరికపు వివాహాలు చేసుకోకపోవడం, వివాహానికి ముందు తలసిమియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవడం లాంటి నివారణ చర్యల ద్వారా తలసిమియా వ్యాధిని లేకుండా చేయవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సికిల్ సెల్ నోడల్ అధికారి డాక్టర్ ప్రదీప్, పెద్ద ముద్దున ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వాణి, ఎం ఎల్ హెచ్ పి లు నీరజ్, పర్యవేక్షణ సిబ్బంది, ఏ ఎన్ ఎం లు, ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్, ఆశా కార్యకర్తలు, పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post