హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ కు కనీస వేతనాలు అమలు చేయాలి

 కనీస వేతనాలు అమలు చేయాలి

 హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ ట్రెడ్ యూనియన్ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్‌కు వినతి

జడ్చర్ల రూరల్, మే 8 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల ఏరియా ఆసుపత్రిలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ ట్రెడ్ యూనియన్ నాయకులు ఎన్. కృష్ణ కోరారు. గురువారం పట్టణంలోని జడ్చర్ల ఏరియా ఆసుపత్రిలో ఆ సంఘం ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ చంద్రకళకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రమకు తగిన వేతనం లేకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల మూడు నెలల వేతనాలు విడుదల చేయాలని నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు జానకిరామ్, జహంగీర్ భాష , ఎండి సోయాబ్, శశికళ, ప్రతిభ, కవిత, ఎవెంజిలిన్, జ్యోతి ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు & పరిశుద్ద కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post