మద్దిగట్లలో వీరబ్రహ్మేంద్రస్వామి వారికి ప్రత్యేక పూజలు

 మద్దిగట్లలో వీరబ్రహ్మేంద్రస్వామి వారికి ప్రత్యేక పూజలు



 భూత్పూర్, మే 12 (మనఊరు ప్రతినిధి): భూత్పూర్ మండలంలోని మదిగట్ల గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయంలో సోమవారం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారికి  పున్నమి సందర్భంగా వీరబ్రహ్మేంద్రస్వామి వారికి పూజలు చుట్టుపక్క గ్రామాల భక్తులు ప్రత్యేక చేశారు. పరమశివుడికి పాలాభిషేకం చేశారు. కలియుగంలో వీరబ్రహ్మేంద్ర స్వామిని ఎందుకు ఆరాధించాలో తెలుసా, వీరబ్రహ్మేంద్రస్వామి వారు జీవ సమాధి కావడంతో ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించినట్టు కలియుగంలో ప్రతి ఒక్కరు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారిని ఆరాధించాలని మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన ఆంజనేయులుగౌడ్ అన్నారు. మద్దిగట్ల గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి గుడి నిర్మాణం నిర్మించి 13 సంవత్సరాలు కావస్తుందన్నారు.  ఇక్కడికి వచ్చే భక్తులు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కాశీ నుంచి తెచ్చిన పరమశివుడు విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు మొక్కలు తీర్చుకునేందుకు వచ్చిన  భక్తులకు శుభాలు కలుగుతాయని తెలియజేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గుడి దగ్గరకి వచ్చే భక్తులకు శుభాలు కలుగుతాయని ఆంజనేయులుగౌడ్ తెలిపారు. ఇక్కడ కాశీలో ఉన్న కల్ప (కథాంబ) వృక్షాలు కాశీలో, కందుకూరు రామలింగేశ్వర స్వామి ఆలయంలో, భూత్పూర్ మండలంలోని మద్దిగట్ల గ్రామంలో ఉన్నాయి అని ఇక్కడ పూజలు నిర్వహించి కొద్దిసేపు నిద్రించడంతో భక్తులు కోరుకున్న కోర్కెలు తీరుతాయని ఆంజనేయులుగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.

Previous Post Next Post