*మానవత్వాన్ని చాటుకున్న బ్యాచ్ మిత్రులు*
*ఇటీవలే మరణించిన కానిస్టేబుల్ విజయ్ కుటుంబానికి 2,65,000/- రూపాయల ఆర్థిక సహాయం*
*ఆర్థిక సహాయం అందించిన 2006వ సంవత్సరం బ్యాచ్ మిత్రులు*
షాద్ నగర్, జూన్ 15 మనఊరు ప్రతినిధి): 2006 సంవత్సరము పోలీస్ ట్రైనింగ్ బ్యాచ్ మిత్రుడైన పోలీస్ కానిస్టేబుల్ విజయ్ అకాలంగా మృతి చెందడంతో ఆయన బ్యాచ్ మిత్రులు కలత చెందారు. తమ బ్యాచ్ మిత్రుడు అకాలంగా మరణించడంతో ఆయన కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలనే సదుద్దేశంతో మానవీయ దృక్పథంతో విజయ్ కుటుంబానికి ఆర్థికంగా కొంత ఊరట కలిగించేందుకు మిత్రులంతా కలిసి 2,65, 000/- వేల రూపాయలను సమీకరించారు. ఇలా సమీకరించిన 2,65,000/- వేల రూపాయల మొత్తాన్ని ఈరోజు 15 జూన్ 2025 న షాద్‌నగర్‌లో వారి కుటుంబానికి చెక్కు రూపంలో వారే స్వయంగా అందజేయడం జరిగింది. ఈ మొత్తాన్ని సమీకరించడంలో అహర్నిశలు కృషి చేసిన బ్యాచ్ మిత్రులు హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ తో పాటు అతని మిత్రులందరూ అభినందనీయులే.