సమాజంలో వైద్యుల పాత్ర కీలకం..
ఘనంగా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో జాతీయ వైద్యుల దినోత్సవం,....
వైద్యులకు శాలువాలతో ఘన సన్మానం
పలు వార్డులలో రోగులకు పండ్ల పంపిణీ
నాగర్ కర్నూల్, జులై 1 (మనఊరు ప్రతినిధి): సమాజంలో వైద్య రంగంలో పనిచేస్తున్న వైద్యుల పాత్ర ఎంతో కీలకమైనదని, కరోనా, ప్రసవలు, ఆక్సిడెంట్, ఇతర ఆరోగ్య క్లిష్ట పరిస్థితులలో రోగులకు అందించిన వైద్య సేవలు వారి సహకారం అవిశ్రాంత కృషి ఎవరు మరువలేరని ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ ఆర్. రఘు అన్నారు. మంగళవారం నాడు లైన్స్ క్లబ్ ఆఫ్ నాగర్ కర్నూల్ మరియు క్లాస్ మెట్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వైద్యులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. భారతదేశంలో డాక్టర్ బిధాన్ చంద్రారాయ్ ఆరోగ్య రంగానికి ఆయన సేవలకు నివాళులర్పించేందుకు జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవాన్ని 1991 మొదటిసారిగా జరుపుకున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ సాధన ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు ,అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్స్ మరియు ఇతర వైద్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి సురేష్, క్లాస్ మెంట్ క్లబ్ అధ్యక్షులు పోల శ్రీనివాస్, ప్రసాద్, సత్య సాయి సేవ సంస్థ కన్వీనర్ హకీం విశ్వప్రసాద్, ప్రొఫెసర్లు డాక్టర్ సుప్రియ, డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ రవిశంకర్ నాయక్, డాక్టర్ అజీమ్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రాజేష్ గౌడ్, డాక్టర్ కోటేశ్వర్, డాక్టర్ వీణ, డాక్టర్ మోన, డాక్టర్ రాజు, డాక్టర్ భరత్వాజ్, డాక్టర్ అంబుజా, డాక్టర్ సురేశ్, డాక్టర్ శంకర్, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ సత్యశ్రీ, డాక్టర్ శైలజ, డాక్టర్ రవి కిరణ్, లైన్స్ క్లబ్ సభ్యులు విశ్వప్రసాద్, ప్రేమ్ కుమార్, చిగుళ్లపల్లి రమణ, బాలకృష్ణ, ఆసుపత్రి సిబ్బంది యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.