*శ్రీశైలంలో ఉచితంగా స్పర్శ దర్శనం సామాన్య భక్తులకు*

స్పర్శదర్శనంపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లోనూ భక్తులకు స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం నూతన ఈవో శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. శని, ఆది, సోమవారాలు, పండుగ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆయా సమయాల్లో స్పర్శదర్శనాలు, అభిషేకాలు నిలిపివేస్తూ శ్రీశైలం దేవస్థానం గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే.. భక్తుల విజ్ఞప్తితో దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి రద్దీ సమయాల్లోనూ స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. రద్దీ రోజుల్లో నాలుగు విడతల్లో అలంకార దర్శనం, మూడు విడతల్లో స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే.. సర్వదర్శనం క్యూలైన్లలో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజుకు మూడు విడుతల్లో స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.