సంపూర్ణ అంధత్వ నిర్మూలనే లక్ష్యం: రాఘవేందర్ రెడ్డి

 అంధత్వ నిర్మూలనే ఐక్యత ఫౌండేషన్ లక్ష్యం

  ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ  సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి







కల్వకుర్తి, జులై 5 (మనఊరు ప్రతినిధి): కల్వకుర్తి నియోజకవర్గంలో సంపూర్ణ అంధత్వ నిర్మూలనే ఐక్యత ఫౌండేషన్ లక్ష్యమని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని సీకేఆర్ ఫంక్షన్ హాల్ లో ఐక్యత ఫౌండేషన్, శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ప్రారంభిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కల్వకుర్తి కోర్టు సీనియర్ జడ్జి శ్రీదేవి, ప్రముఖ సీనియర్ వైద్యులు దామోదర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిం చారు. అనంతరం సుంకిరెడ్డి మాట్లాడుతూ జూలై 5నుంచి 13వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందని, ఈ ఉచిత కంటి వైద్య సేవలను సద్వినియోగ చేసుకోవాలని అన్నారు. కంటి వైద్య పరీక్షలకై మొదటి రోజే 800 వందలకు పైగా హాజరు కాగ 600 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 300 పైగా ఉచిత కంటి అద్దాల పంపిణి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ... సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సేవలు అభినందనీయం అని, గత కొంత కాలంగా ఆయన చేపడుతున్న సేవలను తాము గమనిస్తున్నానని, వాటికి సంబంధించిన పలు సేవల గురించి కూడా నేను తెలుసుకున్నానని, వారికి సమాజం పట్ల, ప్రజలకు ఏదో చెయ్యాలనే సేవా దృక్పథం ఉండడం అభినందిస్తున్నానని, సుంకిరెడ్డి లాగే ప్రతి ఒక్కరు సమాజం పట్ల ఎంతో కొంత సేవ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, పేదలకు ఉచిత కంటి సర్జరీలు, అద్దాల పంపిణి వంటి వ్యయంతో కూడుకున్న సేవలను పేద ప్రజలకి అందిస్తున్నందుకు వారిని ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. అలాగే డాక్టర్ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి ప్రాంతంలో ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, పేదలకు ఉచితంగా సర్జరీలు చేసి, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని వారి గొప్ప సేవలు కల్వకుర్తి ప్రజలకు అందిస్తున్నందుకు ఈ సందర్భంగా సుంకిరెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పవన్ కుమార్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బీస బాలరాజు, యువజన నాయకులు పర్శపాకుల రమేష్, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు తదితరులు, పాల్గొన్నారు.

Previous Post Next Post