అంతా ప్రశాంతమే ఎస్సై మల్లేష్

 అంతా ప్రశాంతమే ఎస్సై మల్లేష్

జడ్చర్ల, జులై 4 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయని ఎస్సై మల్లేష్ తెలిపారు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో ఎస్సై మల్లేష్ తనదైన ముద్ర వేసుకున్న శుక్రవారం ఎస్సై మల్లేష్ తో మన ఊరు ప్రతినిధి చిట్ చాట్ నిర్వహించగా జడ్చర్లలో అంతా ప్రశాంతంగా ఉన్నదని ఆయన అన్నారు. శాంతిభద్రతలు కాపాడటానికి నిరంతరం నిఘా పెడుతూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. అల్లర్లు జరిగినప్పుడు వాటిని నియంత్రించి, శాంతిభద్రతలను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నేరాలను అరికట్టడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడంలో నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. చట్టాన్ని అమలు చేయడంలో నేరాలను నివారించడంలో, ప్రజా భద్రతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నామని ఎస్సై తెలిపారు.

Previous Post Next Post