*ఖర్గే రాకతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం..*
*కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి క్యామ బాల్ రాజు*
ఖిల్లా ఘనపూర్, జులై 4 (మనఊరు ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాకతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపించిందని కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి క్యామ బాల్ రాజు అన్నారు. శుక్రవారం రాజధాని లోని ఎల్బి స్టేడియంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ల ఆధ్వర్యంలో నిర్వహించిన జై బాపూ..జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమానికి ఖిల్లా ఘనపూర్ నుంచి ఆయన ఆధ్వర్యంలో భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమం అభ్యంతం ఆసక్తికరంగా సాగిందని, అగ్రనేతల దిశా నిర్దేశం ప్రకారం రాజకీయంగా ముందుకు సాగుతామని బాల్ రాజు ప్రకటించారు. నాయకులు, కార్యకర్తలు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.