సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షల శిబిరం

 సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షల శిబిరం

మంగనూరు గ్రామంలో సమగ్ర ఆరోగ్య శిబిరం విజయవంతం

 లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ టి. ప్రసన్న


బిజినపల్లి, జూలై 3 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా గురువారం మంగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ టి. ప్రసన్న సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఆరోగ్య స్థితిని సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకోవడం ద్వారా తెలుసుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈరోజు నుంచి నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈరోజు ఈ ఆరోగ్య శిబిరంలో 142 మందికి 7 రకాల పరీక్షలు రక్తపోటు మధుమేహ , పరీక్షలతో పాటుగా టీబి కళ్ళే, ఎక్స్రేరే, హిమోగ్లోబిన్, సుఖ వ్యాధులైన హెచ్ఐవి, సిఫిలిస్, హెపటైటిస్ -బి హెపటైటిస్ -సి వ్యాధి నిర్ధారణ రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు మందులు పంపిణీ చిరు వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య అవగాహన, మందులు అందజేశారు. ఈ పరీక్షల ద్వారా వారి ఆరోగ్యస్తాయి తెలుస్తుందని, కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా దిశా మేనేజర్ రమేష్ రాజ్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ చంద్రశేఖర్, ఆరోగ్య కార్యకర్తలు అబ్దుల్ సలీం, పి.జ్యోతి, ఆశా కార్యకర్తలు శారద, కృష్ణవేణి, పద్మ, బాలమణి, అనిత, నాగమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.

Previous Post Next Post